శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్న హస్తం అందిస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ బస్తీకి చెందిన ఎల్.వనిత అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF-LOC ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల ఆర్థిక సహాయానికి సంధించిన CMRF-LOC మంజూరు పత్రాలను నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధితుడికి జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ సదుపాయాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ నాయకులు రాఘవులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.