శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హెచ్ సీయూ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ఖబర్ధార్ సీఎం రేవంత్ రెడ్డి, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడంపై విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హెచ్ సీయూ భూముల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.