శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దళిత నాయకుల పట్ల, దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమాన పరిచే విధంగా, అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఏక వచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట గలిపారని పేర్కొంటూ మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ చౌరస్తా లో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా,అమర్యాదగా,అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏక వచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట గలిపారన్నారు. అందుకనే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్ హుస్సేన్, మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుప్రజ, మహిళా నాయకురాలు, రాణి,ఉమ, కృష్ణ, మియాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ నాయక్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్,శివ విజయ్, గోల్కొండ రాజు,పాండు, వంశి, అవినాష్, తౌసిప్ తదితరులు పాల్గొన్నారు.