మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ రాణించాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్యాణ మండపంలో సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలలో భాగంగా చందానగర్ సర్కిల్ పరిధిలోని ఆర్.పి ( రిసోర్స్ పర్సన్స్) లకు డ్రెస్ కోడ్ (ఏకరూప) దుస్తులను డీసీ మోహన్ రెడ్డి, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, బాలింగ్ గౌతమ్ గౌడ్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని RP లకు డ్రెస్ కోడ్ లు అందచేసి , కేక్ కట్ చేసి, అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ సంద‌ర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని, మహిళలందరికి అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. మహిళ లు వంటింటికే పరిమితం కాకుండా అంది వచ్చిన అవకాశాలను పునికిపుచ్చుకొని అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించి ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఆర్థిక స్వాలంబన పొందాలని, పురుషులతో సమానంగా పోటీ పడాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here