సమాజానికి జ్ఞాన ఫలాలను అందించేవాడే గురువు: కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

విద్య అనే విత్తనం వేసి అక్షరం అనే నీరు పోసి చెడు అనే కలుపును ఏరివేసి మంచి ఔషద మొక్కను, మంచి నీతి ఫలాలను సమాజానికి అందించేవారు గురువర్యులని, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ 140 వ జయంతిని పురస్కరించుకుని శనివారం లింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన ఆదిమ యుగం నుంచి నేటి కలియుగం వరకు గురువులను పూజించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే బాధ్యతను ఉపాధ్యాయులందరు తప్పక పాటిస్తారని, అందుకే సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువులకు ఇస్తామన్నారు. విద్యార్థులకు మార్గదర్శకుడు గురువైతే భవితకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దిక్సూచిలాంటి వారన్నారు. అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులకు శాలువా కప్పి మెమొంటోతో సత్కరించారు. జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శంకర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో గోపీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదయ్య, మహేందర్ రెడ్డి, లలిత, గంగాధర్, ధన్ రాజ్, భీమయ్య తో పాటు ఉపాధ్యాయులు దుర్గాభవాని, రమణాకుమారి, యాదమ్మ, కిష్టయ్య, రవీందర్, శ్రీనివాస్ , నాయకులు చంద్రకళ, రజిని, భాగ్యలక్ష్మి, ఝాన్సీ, కుమారి, రోజా, కళ్యాణీ, రవి తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here