శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గురించి మాట్లాడిన మాటలను చూస్తుంటే బీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టమవుతుందని, దళితులు అంటే ఆ పార్టీకి ఏపాటి గౌరవం ఉందో తెలిసిపోతుందని హఫీజ్‌పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, దాసన్న, వెంకటేష్ గౌడ్, పవన్ గౌడ్, సుదీష్, జ్ఞానేశ్వర్,సాయి, నాయుడు, సాదిక్, అసద్, రామ్, జహీర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, జానీ, సాయిరామ్, ఏ స్ వి నాయక్, పరమేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.