శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): వరల్డ్ కిడ్నీ డే ను పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్, హార్లే డేవిడ్‌సన్ బైకర్స్ కలిసి కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ విచ్చేసి జెండా ఊపి రైడ్‌ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్స్ గ్రూప్, బంజారా చాప్టర్ సభ్యుల భాగస్వామ్యంతో కలిసి కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచేందుకు, ప్రజల్లో కిడ్నీ ఆరోగ్యంపై చైతన్యం కలిగించడానికి నిర్వహించడం చాలా అభినందించాల్సిన విషయం అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు కన్నా ఆరోగ్యం ఎంతో విలువైందని అన్నారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కమల్ కిరణ్ మాట్లాడుతూ చాలా మందికి కాళ్లలో వాపు, నిరంతర అలసట చిన్న సమస్యలుగా కనిపిస్తాయి కానీ వాటి తీవ్రత దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ఉన్నట్లు బయటపడుతున్నాయి. అనేక మంది ప్రజలకు ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపాయినా మూత్రపిండాలు పని చేయడం ఆగిపోవడం సాధారణంగా కనిపిస్తోంది.భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్య. గత దశాబ్దంలో వేలాది మరణాలకు కారణమైన ఈ యొక్క వ్యాధి. CKD అధికంగా ఉండడానికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు అని అన్నారు.
CKD రోగుల్లో 87% మందికి హైబీపీ ఉంది, 37.5% మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. అదనంగా, ఇతర సమస్యలకి మందులు అధిక వినియోగం, డీహైడ్రేషన్ మూత్రపిండ ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు కూడా CKD పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఎండలో ఎక్కువ సమయం పనిచేసే కార్మికులు నిర్జలీకరణకు గురవడంతో కిడ్నీల పై ఒత్తిడి పెరిగి, ముదిరిన స్థాయిలో మూత్రపిండ వైఫల్యం కలుగుతోంది. ప్రపంచ మూత్రపిండ దినోత్సవం 2025 థీమ్ మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా? ముందస్తు పరీక్షలు చేయించుకోండి, ఆరోగ్యంగా ఉండండి అనే సందేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్, మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్, హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రైడ్ కిడ్నీ ఆరోగ్యం పై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి నియోపోలీస్ మూవీ టవర్స్ మీదుగా క్రిమ కేఫ్ మోకిల, అక్కడ నుంచి తిరిగి మెడికవర్ హాస్పిటల్స్ కు చేరుకుంది.