ఉచిత వైద్య శిబిరాల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి: PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ

శేరిలింగంపల్లి, మార్చి 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ లో తెలంగాణ ఒడిశా డాక్టర్స్ అసోసియేషన్(TODA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను శ్రీ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ చైర్మన్ రాంచందర్, డాక్టర్ రవిశంకర్ ల‌తో కలసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ఒడిశా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలిస్టిక్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహించుకోవడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రజలకు ఈ మెగా మెడికల్ క్యాంప్ ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని అన్నారు. నిష్ణాతులైన ఒడిశా డాక్టర్ల బృందం అన్ని రకాల ఉచిత పరీక్షలు నిర్వ‌హిస్తుంద‌ని, ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒడిశా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నిహార్ ప్రధాన, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనురాధ పాండా, సెక్రటరీ డాక్టర్ కలిల్, డాక్టర్ సునీల్ స్వైన్, నాయకులు దామోదర్ రెడ్డి, MD ఇబ్రహీం, అష్రాఫ్ , వైద్య సిబ్బంది సునీత , కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here