- భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా పోటీలు
- కొమిరిశెట్టి ఫౌండేషన్, విజేత సూపర్ మార్కెట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ
నమస్తే శేరిలింగంపల్లి: భవిష్యత్ తరాలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అందించడమే లక్ష్యంగా కొమిరిశెట్టి ఫౌండేషన్, విజేత సూపర్ మార్కెట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా
సోమవారం ఉదయం 10గంటల నుంచి C. R. ఫౌండేషన్, స్వామి రామానంద తీర్థ ఫౌండేషన్, హుడా కాలనీ భారతి మహిళా మండలి, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పట్టణీకరణ నేపథ్యంలో అపార్ట్ మెంట్ కల్చర్ బాగా పెరిగిన తరువాత తమ ఇంటి ముందు ముగ్గులు వేయడం కాలక్రమేణా తగ్గిపోతున్నదని, ఈ నేపథ్యంలో సంక్రాతి పండుగ సందర్బంగా మహిళలకు ఉన్నతిని చేకూర్చే చేతి కళగా ముగ్గులను గుర్తించి శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలోని 35 కాలనీలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో ప్రధమ, ద్వితీయ, తృతీయ మరియు ఐదు ప్రోత్సాహక బహుమతులను విజేతలకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలలో న్యాయనిర్ణేతలుగా విజయలక్ష్మి, రజని వ్యవహరించారు. స్థానిక మహిళా నాయకురాళ్ళు Dr. రజని, కృష్ణకుమారి, తన్వీర్ బేగం, రాధారాణి, స్వయంప్రభ, దేవి, భూదేవి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, జనార్ధన్ పాల్గొన్నారు.