మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ-విటారా ఆవిష్క‌ర‌ణ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో నెక్సా షోరూమ్ లో మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ-విటారా ఎస్‌యూవీ నూతన కార్ ను సాయి సర్వీస్ సీఈఓ ఉదయ్ కులకర్ణి, మారుతి సుజుకి టెరిటరీ సేల్స్ మేనేజర్ సుభాష్ చంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రతినిధి మూర్తి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రతినిధి ఉదయశ్రీ, చోళమండలం ఫైనాన్స్ ప్రతినిధి స్వామి, సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ మోహన్ నాయక్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ-విటారా ఎస్‌యూవీ నూతన వాహనాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ వినియోగంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మారుతి సుజుకి వంటి ప్రముఖ సంస్థ ఎలక్ట్రిక్ రంగంలో అడుగుపెట్టడం దేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ ప్రతినిధులు, సీనియర్ నాయకులు ప్రసాద్ , సుమన్, నగేష్, బాబు, రమేష్, నరసింహ, మణికంఠ, శ్రీను, సుబ్రమణ్యం, స్థానిక నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here