ఆర్యవైశ్య సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ A బ్లాక్ లో ఎమ్మెల్యే SDF నిధులు రూ.10 లక్షల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఆర్యవైశ్య సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజ‌రై భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆర్య వైశ్య సంఘం కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, చిన్న చిన్న సమావేశాలు, సభలు , బర్త్ డే కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు  సంతోషంగా ఉందన్నారు. కమ్యూనిటి హాల్ ను నాణ్యత ప్రమాణాల తో నిర్మించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, అన్ని హంగులతో సకల సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ను త్వరితగతిన చేపట్టి ప్రజలకు , కాలనీ వాసులకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్‌పేట్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు గంప సత్యనారాయణ గుప్తా, పల్లెల వీరేశం గుప్తా, కందికొండ యాదగిరి గుప్తా, తడుపునూరు రవీందర్ గుప్తా, వి ప్రభు గుప్తా, సత్య ప్రకాష్ గుప్తా, లింగమూర్తి గుప్తా, గోపాల్ గుప్త, బుస మల్లేశం గుప్తా, కైలాస వెంకటేశం గుప్తా, పల్లెల వెంకటేశం గుప్తా, వెంకటేశం గుప్తా, రాములు గుప్తా, సుధాకర్ గుప్తా, శేరిలింగంపల్లి మండలం నుంచి అధ్యక్షుడైన ధార లక్ష్మయ్య గుప్తా, మాజీ అధ్యక్షుడు గోలి రాజుగుప్తా, జనరల్ సెక్రెటరీ పప్ప మల్లేష్ గుప్తా, కోశాధికారి ఉప్పల భాస్కర్ గుప్త, శెట్టి ప్రభాకర్ గుప్తా, మారం వెంకట్ గుప్తా, విశ్వేశ్వరరావు గుప్తా, చిన్నం సత్యనారాయణ గుప్తా, కిషోర్ కుమార్ గుప్తా, ప్రవీణ్ కుమార్ గుప్తా, సుధాకర్ గుప్తా, కుమార్ గుప్తా, వీరేశం గుప్తా, వీరయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here