కృషి నగర్ కాలనీలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కృషి నగర్ కాలనీ వాసులు మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ కాలనీలో తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పీఏసీ చైర్మ‌న్, ఆరెకపూడి గాంధీ సహకారంతో ప‌రిష్క‌రిస్తాన‌ని అన్నారు. కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృషి నగర్ కాలనీ వాసులు వంశీ కృష్ణ రెడ్డి, పాపి రెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, శ్రీనివాస్, సురేష్ రెడ్డి, రామ‌కృష్ణ రాజు, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here