శిల్పారామంలో ఖాదీ మహోత్సవం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శిల్పారామం లో ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ ఖాదీ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాదీ, గ్రామ పరిశ్రమల స్థాపన, అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం ద్వారా చేతి వృత్తుల‌ వారికి, పరిశ్రమ స్థాపనకు పనిముట్లతో జీవనోపాధి చేసుకునే వారికి ఆర్ధిక సహాయం అందించి ప్రోత్సహిస్తుంద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. సాంప్రదాయ పరిశ్రమలను ఆధునీకరించడానికి వాటిని బలోపేతం చేయడానికి తోడ్పాటును అందిస్తుంద‌ని, తెలంగాణ , మహారాష్ట్ర , బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి ఖాదీ, చేనేత, హస్త కళా ఉత్పత్తుల తో దాదాపు యాభై స్టాల్ల్స్ ఏర్పాటు చేయడం జరిగింద‌ని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సాహితి అజ్జరపు శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, అయిగిరినందిని, శ్రీ విజ్ఞ రాజాం భజే, నవరసములది, భో శంభో, తిల్లాన, రామదాసు బాలే అంశాలను కళాకారులు హేమాన్య, ప్రణతి, దామిత, చరిత, అక్షర, లాస్య ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here