- గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి, సహా కార్యదర్శి వి తుకారాం నాయక్, మైదం శెట్టి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: ఎంసిపిఐ యు జిల్లా కార్యాలయం మియాపూర్ ముజాఫర్ అహమ్మద్ నగర్ లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ప్లీనరి సమావేశాన్ని జయప్రదం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి, సహా కార్యదర్శి వి తుకారాం నాయక్, మైదం శెట్టి రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఎంసిపిఐ యు పార్టీ గ్రేటర్ నాయకులు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 200 వందల మంది ప్రతినిధులు, సౌహర్ద ప్రతినిధులుహాజరు అవుతారని తెలిపారు. ఈ సందర్బంగా ఎంసిపిఐ యు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి, సహా కార్యదర్శి వి. తుకారాం నాయక్, మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కారానికి కార్మిక, కర్షక రాజ్య స్థాపనకు, సామాజిక న్యాయస్థాపనకై అమరజీవులు అసెంబ్లీ టైగర్, తెలంగాణ రైతంగా సాయుధ పోరాటయోధులు మాజీ ఎమ్మెల్యే ఓంకార్, మాజీ ఎంపీ భీంరెడ్డి నరసింహారెడ్డి, మాజీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ చూపిన బాటలో.. నీతిగా నిజాయితీగా ఎంసిపిఐ యు నిరంతరం పనిచేస్తున్నదన్నారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు వెళుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు ప్రజా ఉద్యమాల నిర్మాణం కోసం గత పరిస్థితులను నెమరుచుకొని ఆ అనుభవాలతో గ్రేటర్ హైదరాబాద్ ఉద్యమ ప్రణాళిక వేసుకోవడానికి గ్రేటర్ ప్లినరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై తగిన సూచనలు సలహాలు అందిస్తారన్నారు. కార్యక్రమం లో గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, లసాని రాజు, పల్లె మురళి, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు బి. విమల, వై. రాంబాబు, మియాపూర్ డివిజన్ సభ్యులు మైదం శెట్టి రాణి, గూడ లావణ్య, జి. శివాని, దార లక్ష్మి, కె. రాజు, దేవనూర్ నర్సింహా, ఎం రాజు పాల్గొన్నారు.