శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ముస్లింలు ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటూ అజ్మీర్ షరీఫ్ దర్గాను హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలను నింపాలని, అల్లాహ్ కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.






