శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని హఫీజ్‌పేట గ్రామంలో స్థానికులు శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట గ్రామస్తులు, హనుమాన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు మనోజ్ యాదవ్, వెంకట రమేష్, హేమంత్ ముదిరాజ్, మునిగొండ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.






