యువత శివాజీ మహారాజ్ స్ఫూర్తితో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: గంగల రాధాకృష్ణయాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మాదాపూర్ ఇజ్జ‌త్ న‌గ‌ర్ శివాజీ స‌ర్కిల్ మీనాక్షి స్కైలైన్ వ‌ద్ద బీజేపీ, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగల రాధాకృష్ణయాదవ్ ఆధ్వర్యంలో శివాజీ మ‌హ‌రాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణయాదవ్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపన కోసం చేసిన పోరాటం భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ, స్త్రీ గౌరవం, సమర్థ పరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆయన చూపిన మార్గం నేటి నాయకులకు ఆదర్శమని తెలిపారు. యువత శివాజీ మహారాజ్ స్ఫూర్తితో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, బాలు నాయక్, నరేష్ రెడ్డి, శ్రీశైలం, కుమార్, వేణుగోపాల్ రెడ్డి, మోహన్ నాయక్, భారతి, బలమ్మ, సాలమ్మ, నాగమ్మ, యశోథ్, కృష్ణమ్మ, మహిళా మోర్చా సభ్యులు, యువ మోర్చా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here