శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాంకీ పెరల్ కాలనీలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన చిన్నారులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రాంకీ పెరల్ కాలనీ లో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించడం గొప్ప విషయం అని, ఆటలపోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అభినందిస్తూన్నానని, వారికి బహుమతులు ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చిన్నారులలో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి వారిలో పోటీతత్వం నెలకొల్పి చిన్నారులు ఎంచుకున్న రంగాలలో ప్రోత్సాహించాలని, వారి లో దాగి ఉన్న ప్రతిభ ను గుర్తించి అటు వైపు ప్రోత్సహిస్తే విజేతలుగా నిలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






