శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో నిర్వహించ తలపెట్టిన శ్రీ సద్గురు రవిదాస్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, హఫీజ్ పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ను కాలనీవాసులు ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మోచి సంఘం అధ్యక్షుడు నాందేవ్, సభ్యులు విశ్వనాథ్, ప్రభు పాల్గొన్నారు.






