శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రతినిధులు 5 ఏళ్లుగా డివిజన్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని, అనేక చోట్ల మురుగు నీటి సమస్య ఉందని యంసిపిఐ (యు) నాయకుడు పల్లె మురళి అన్నారు. FCI కాలనీ సెంట్ రీటా స్కూల్ వెనుక రోడ్డులో గత 5 నెలలుగా మురుగు నీరు నిలుస్తుందని పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. తాత్కాలికంగా సిబంది వ్యర్ధాలు తీసిన మళ్ళీ రెండు రోజులలో మురుగు నీరు చేరుకుంటుందని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. 5 సంవత్సరాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించుకున్నారే తప్ప అనేక కాలనీలలో మురుగు నీరు కంపు, త్రాగునీరు, డ్రైనేజ్ సమస్యలను అసంపూర్తిగా వదిలేశారని, కనీస మౌలిక సదుపాయాలు పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. రూ.200 కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న నాయకులు అక్కడ మురుగు నీరు ఎందుకు ప్రవహిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.






