శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో రూ.18 కోట్ల 92 లక్షలతో పటేల్ చెరువు అలుగు నుండి గంగారం చెరువు వరకు నాలా విస్తరణ పనులలో భాగంగా నిర్మిస్తున్న RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను,RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం, నాలా విస్తరణ నిర్మాణం పనులకు కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేష్ గౌడ్, SNDP విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నాలాల విస్తరణ పనులు చేపట్టడంతో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతనంగా చేపట్టబోయే నాలా విస్తరణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరనుంది అని, నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, స్థానిక కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






