- ప్రభుత్వ విప్ గాంధీ కి వినతి పత్రం సమర్పించిన మహిళ సమాఖ్య రిసోర్స్ పర్సన్లు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మహిళ సమాఖ్య రిసోర్స్ పర్సన్ (ఆర్.పి) లు పలు సమస్యలను పరిష్కరించాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహిళ సమాఖ్య రిసోర్స్ పర్సన్ (ఆర్.పి) లు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఎంతగానో పనిచేస్తున్నామని , ప్రభుత్వ పరంగా నిర్వహించే సర్వే లలో పనిచేస్తున్నామని, ముఖ్యంగా జి.ఓ నంబర్ 164 ను తొలగించి ప్రభుత్వ పరంగా వేతనాలు చెల్లించాలని, వేతనాలు నెలకు రూ. 18 వేల వరకు పెంచడం తో పాటుగా నెల నెల చెల్లించే పెసలుబాటు కలిపించాలన్నారు. ఆర్.పి లకు డ్రెస్ కోడ్, ఐడి కార్డ్ ల జారితో పాటుగా ప్రభుత్వ ఆరోగ్య బీమా సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గాంధీని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెలంగాణ పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ఆర్.పిల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమటం పద్మ ఆర్ .పి లు పరకాల స్వప్న, రూప, ప్రభావతి, పర్వీన్, లత, జ్యోతి, ప్రేమలత, ప్రమీల, పద్మ, స్వాతి, కవిత పాల్గొన్నారు.