నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
మయూరి నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించామని, కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, వర్క్ ఇన్ స్పెక్టర్ రఘు, నవీన్, స్థానిక నాయకులు చంద్రిక ప్రసాద్, అశోక్, కాలనీ వాసులు, విజయ్, చంటి బాబు, పి రవి, ప్రవీణ్, జగదీష్, మనోహర్, రాజేష్, వెంకట్, వికాస్, ఫ్రాన్సిస్ రెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.