12న మెగా క్రిస్మస్ వేడుకలు

  • చందా నగర్ పీజేఆర్ స్టేడియం వేదికగా ఘనంగా ఏర్పాట్లు  

నమస్తే శేరిలింగంపల్లి : చందా నగర్ పీజేఆర్ స్టేడియం వేదికగా ఈ నెల 12న మెగా క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆతిధ్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సువార్తికులు డాక్టర్ దీవెన్ కుమార్ హాజరు కానున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 200కి పైగా అన్ని చర్చ్ లు ఒకే వేదికపైకి చేరి మెగా క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నాయి. ఈ సందర్భంగా మెగా క్రిస్మస్ ఉత్సవాల పోస్టర్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో విడుదల చేశారు. ఉత్సవాల కమిటీ కన్వీనర్లు రెవరెండ్ ఎడ్వర్డ్ రోజ్, రెవరెండ్ పీ. యేసుపాదం, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ విప్పర్తి, రెవరెండ్ టీ ఆర్ రాజు, పాస్టర్ స్వామి, పీజీ బర్నబాస్, సతీష్, కొర్నే మోజెస్ తో పాటు పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో ప్రముఖ క్వయర్ బృందంచే ప్రత్యేక గీతాలు.. క్రిస్మస్ పండుగ విశిష్టతను తెలిపే స్కిట్లు.. శాంతాక్రజ్ వేషధారణలతో డ్యాన్స్ ..భారీ కేక్ కటింగ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా రూపొందిస్తున్నారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు, స్థానికుల కోసం క్రిస్మస్ విందు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలంతా కూడా మెగా క్రిస్మస్ ఉత్సవాల్లో పాలు పంచుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. క్రిస్టియన్ల సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు.

ఉత్సవాల పోస్టర్ ను తన నివాసంలో విడుదల చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here