బాడీ క్రాఫ్ట్ క్లినిక్ , సెలూన్ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, మే 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన బాడీ క్రాఫ్ట్ క్లినిక్ , సెలూన్ ను ప్రముఖ సినీ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బ్యూటీ అండ్ వెల్ నెస్ సేవ‌లు అందించేందుకు హైద‌రాబాద్ లో రెండవ బ్రాంచ్ ను ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని , బ్యూటీ అండ్ వెల్ నెస్ రంగంలో ఉన్న విస్తృత ఉపాధి అవ‌కాశాల‌ను ఉమెన్ ఎంట‌ర్ ప్రైన‌ర్స్ అందిపుచ్చుకోవాల‌ని PAC చైర్మన్ గాంధీ తెలిపారు. త‌మ మొద‌టి బ్రాంచ్ బెంగ‌ళురులో ఏర్పాటు చేశామ‌ని. రెండ‌వ‌ది హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన‌ట్లు నిర్వ‌హ‌కులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, గణేష్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, ఓ వెంకటేష్, తిరుపతి, నరేందర్ బల్లా, వరలక్ష్మీ, భవానీ , హరి కృష్ణ , రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here