శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): పొగాకు ఉత్పత్తులను సేవించడం వల్ల కలిగే అనారోగ్య కారణాలను ప్రజలకు తెలియచేసే లక్ష్యంతో ప్రతి ఏటా మే 31 వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ( World No Tobacco Day ) సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసం వద్ద ప్రజాపిత బ్రహ్మ కుమారిస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన అవగహన ర్యాలీలో కూకట్‌పల్లి డీసీ గంగాధర్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని అన్నారు. పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే అనారోగ్య కారణాలను ప్రజలకు తెలియచేసే లక్ష్యంతో ప్రతి ఏటా మే 31 వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ( World No Tobacco Day ) నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గుండె సంబంధిత జబ్బులు , సంతాన లేమి సమస్యలు, వివిధ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని, పొగాకు ఉత్పత్తుల వాడటం వలన కలిగే దుష్ప్రభావల గురించి ప్రజలలో చైతన్యపర్చడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి ప్రగఢ సత్యనారాయణ రావు, బ్రహ్మ కుమారిస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.