శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సిఐ కాలనీ నుండి మియాపూర్ విలేజ్ వరకు చేపట్టిన (UGD) భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తు పనులను స్థానిక నాయకులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డ్రైనేజీ మరమ్మత్తు పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలియజేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలలో ఎలాంటి సమస్యలు వున్నా తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ, మంజీరా సరఫరా కొరత వంటి తదితర సమస్యలపై అప్రమత్తంగా ఉంటామని, డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకటేశ్వరరావు, డిఎస్ఆర్కె ప్రసాద్, మహమ్మద్ ఖాజా, సాంబయ్యా, మూర్తి, పుల్లారావు, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.