శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున ఎనక్లేవ్ కాలనీలోనీ పార్క్ లో ఎశియామ్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీలోనీ పార్కులో ఎశియామ్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించడం జరిగిందని, ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ సంస్థలు, కాలనీలు ముందుకు రావడం మంచి విషయం అని, ప్రజలు ఇలాంటి సదుపాయాలను ఉపయోగించుకోవాలని, ఆరోగ్యం పై శ్రద్ధ వహించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎశియామ్ సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పద్మనాభయ్య, హనుమ రెడ్డి, కాలనీ వాసులు రామకృష్ణ వర్మ, రమణ రెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటేశ్వరావు, శివ, లక్ష్మీ, గోపాల కృష్ణ, సురపురాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.