గుజరాత్ లో రికార్డ్ బ్రేక్ .. సంబురాల్లో శేరిలింగంపల్లి బిజెపి శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ గాంధీ విగ్రహం వద్ద గుజరాత్ లో మోడీ నేతృత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ తన రికార్డ్ తానే బ్రేక్ చేస్తోన్న బీజేపీ అని, ఏదైనా పార్టీ రెండు సార్లు అధికారంలో ఉంటే.. మూడోసారి వ్యతిరేక గాలులు వీస్తాయని, అయితే గుజరాత్ లో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో విజయోత్సవ సంబురంలో మాట్లాడుతున్న బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్

1995లో 121 సీట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. 1998లో 117, 2002లో 127, 2007లో 117, 2012లో 115, 2017లో 99 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఏకంగా 144 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తున్నదన్నారు. తద్వారా 2002 తర్వాత అత్యధిక స్థానాల్లో గెలిచిన పార్టీగా బీజేపీ తన రికార్డును తానే బ్రేక్ చేయనుందని బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పగటి కలలు కంటున్నా కెసిఆర్ గుజరాత్ ప్రజలు ఇచ్చిన తీర్పే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నవత రెడ్డి, సింధు రెడ్డి, పద్మ, నాగుల్ గౌడ్, ఎల్లేష్, రాధాకృష్ణ, డివిజన్ అధ్యక్షులు, మహిళా మోర్చా నాయకురాలు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ గాంధీ విగ్రహం వద్ద సంబురాల్లో పాల్గొన్న బిజెపి శ్రేణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here