మహిళామణులు ఆదర్శ మూర్తులుగా ఎదగాలి : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మహిళ లు వంటింటికె పరిమితం కాకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్ప కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళ సంక్షేమ మండలి కార్యలయాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాదారు. ‘స్త్రీ’ లేకపోతే గమనం లేదు!, ‘ స్త్రీ’ లేకపోతే సృష్టిలో జీవం లేదు!, అని, సమాజాన్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీ’ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాజీవ్ గృహ కల్ప కాలనీ లో మహిళ సంక్షేమ మండలి కార్యలయాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

మహిళలు అన్నిరంగాలలో నిలవాలని, మహిళ సాధికారికత సాదించాలని, మహిళ సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి వారికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ జనరల్ సెక్రెటరీ చింతకింది రవీందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్మారావు, యోగి, నర్సింహ రెడ్డి, గోపాల్ యాదవ్,సంతోష్ బీఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు రమ, శ్రీకళ, చంద్రకళ, రజిని,స్వరూప, భాగ్యలక్ష్మి, సౌజన్య, జయ, శశికళ, రమాదేవి, కుమారి, కళ్యాణి, రోజారాణి, సుధారాణి, రాములమ్మ, మహిళ సోదరిమణులు పాల్గొన్నారు.

మహిళ సంక్షేమ మండలి కార్యలయ ప్రారంభం అనంతరం కేక్ కట్ చేస్తున్న గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here