నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్ప కాలనీ లో బీఆర్ ఎస్ పార్టీ మహిళ నాయకురాలు రజిని ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళ సోదరీమణులను శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందచేసి వారికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ జనరల్ సెక్రెటరీ చింతకింది రవీందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్మారావు, రజిని, కుమారి, దివ్య, భూదేవి, లలిత, గౌస్య, నజియా, లత, మంజుల, మనీషా, సోనీ, మధురిమ, మహిళ సోదరిమణులు పాల్గొన్నారు.