- ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్, మై హోమ్ భూజ గేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి దేశంలో మోడీని, చేవెళ్ల పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు మద్దతు ఇవ్వాలని సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు, సీనియర్ సిటిజన్స్ ను కోరారు.
ఈ సందర్భంగా కమ్యూనిటీ వారు కొన్ని సమస్యలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం గెలిచిన వెంటనే స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నరసింహ రాజు, పవన్, అరవింద్, సంతోష్, ప్రసాద్, పురుషోత్తం, అనిత రెడ్డి పాల్గొన్నారు.