- కార్పొరేటర్లతో కలిసి నిరసన
నమస్తే శేరిలింగంపల్లి : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అప్రజాస్వామికమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ క్రాస్ రోడ్డు లో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాధవరం రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయని, కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక దొడ్డి దారిన కక్ష పూరిత చర్యలకు తెర లేపిందన్నారు. ఈడీ, ఐటీ సంస్థలతో ప్రత్యర్థి పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రధాని మోడీ చూస్తున్నారని, ఇది ఎంతకాలం నిలవదన్నారు.
కెసిఆర్ నీ రాజకీయంగా ఎదుర్కొలేకనే బిజెపి, కాంగ్రేస్ ఒక్కటయ్యాయని, సుప్రీం కోర్టు చెప్పిన మాటలకు విరుద్ధంగా ఈడి అరెస్ట్ చేయడం సరికాదని, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను దెబ్బతీయడం కోసం ఈ అరెస్ట్ అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధాసంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.