నమస్తే శేరిలింగంపల్లి : అల్విన్ కాలనీ డివిజన్ కు చెందిన ఎల్లమ్మబండ మరియమ్మనగర్ వాసి ఎస్.నర్సింహచారి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు.
ఈ సందర్భంగా ఆయనకు సీఎంఆర్ ఎఫ్ఎల్వోసీ రూ. 2 లక్షల 50వేల ఆర్ధిక సహాయం మంజూరైంది. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ ఎఫ్ఎల్వోసీ మంజూరి పత్రాలను డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, బాష్పక యాదగిరి ఇతర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధితుడికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ అందించారు.