దేవాలయాలకు బోనాల నిధులు

  • రూ.25 లక్షల 80 వేలు చెక్కు రూపేణా అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 90 దేవాలయాలకు మంజూరైన రూ.25 లక్షల 80 వేలు మంజూరయ్యాయి.

ఈ మంజూరైన నిధులను చెక్కుల రూపేణ దేవాలయాల కమిటీ ప్రతినిధులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బోనాల పర్వదినంను కన్నుల పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకున్నామని తెలిపారు. అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి . ఇబ్రహీం, మోజేశ్, ప్రమీల పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here