శేరిలింగంపల్లి, జూన్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాతృశ్రీ నగర్ కాలనీకి చెందిన విద్యార్థి కె. జీవన్ సాయికుమార్ NEET-2025లో అఖిల భారత స్థాయిలో 18వ ర్యాంకు సాధించడం, రెండు తెలుగు రాష్ట్రాలలో టాపర్‌గా నిలవడం పట్ల అతనికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, స్టాండింగ్ కమిటీ మెంబర్ జగదీశ్వర్ గౌడ్ అభినందనలు తెలియజేశారు. సాయికుమార్ కఠినమైన శ్రమను, అంకితభావాన్ని జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా అతను ఉత్తమ విజయాలు సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అతనికి ఈ విజయయాత్రలో అండగా నిలిచిన తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.