శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు తారానగర్ ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. 11కేవీ ఇంజినీర్స్ ఎన్‌క్లేవ్ ఫీడర్ పరిధిలో ఉన్న గంగారం, మంజీరా పైప్ లైన్ రోడ్డు, గంగారం మెయిన్ రోడ్డు, ఇంజినీర్స్ ఎన్‌క్లేవ్‌లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 11కేవీ ఆర్‌టీసీ కాలనీ ఫీడర్ పరిధిలోని చందానగర్ హుడా కాలనీ ఏరియా, ఎంఎంటీఎస్ రోడ్డులో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.