- బిఆర్ ఎస్ లో చేరిన వ్యాపారవేత్తలు ఆప్తబ్, మహ్మద్ ఇస్మాయిల్
- పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నివసించే ప్రముఖ వ్యాపారవేత్తలు ఆప్తబ్, మహ్మద్ ఇస్మాయిల్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు మిద్దెల మల్లారెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసానికి వెళ్లి జాయిన్ అవ్వగా.. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల చూపు బీఆర్ఎస్ వైపే ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ బిఆర్ ఎస్ ను ఆదరిస్తూ.. ఆశీర్వాదిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, హనీఫ్ పాల్గొన్నారు.