శేరిలింగంపల్లి, జూన్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ ఎర్రపోచమ్మ ఆలయం ప్రాంగణం నుండి చిత్తారమ్మ ఆలయం వరకు శ్రీ గౌరి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నూకాంబిక అమ్మవారి జాతర సారె, ఘటాల ఊరేగింపు మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్, జగద్గిరిగుట్ట CI నర్సింహలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ గౌరి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నూకాంబిక అమ్మవారి జాతర సారె, ఘటాల ఊరేగింపు మహోత్సవం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. శ్రీ శ్రీ శ్రీ ఎర్రపోచమ్మ ఆలయం ప్రాంగణం నుండి చిత్తారమ్మ ఆలయం వరకు ఊరేగింపు గా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా కన్నుల పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకునేందుకు వీలుగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలా బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ చక్కటి సదవకాశంను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని, బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు, మౌళిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. నిధుల మంజూరు కోసం దరఖాస్తుకు కావలసిన పత్రాలు దేవాలయం పేరు మీద ఉన్న లెటర్ హెడ్, దేవాలయం ఫొటోలు(అమ్మవారి ఫొటోలు), దేవాలయం స్టాంప్, దేవాలయం పాన్ కార్డ్, దేవాలయం పేరు మీద ఉన్న బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, దేవాలయం రిజిస్ట్రేషన్ పత్రం జిరాక్స్ , దేవాలయం చైర్మన్ లేదా కార్యదర్శి ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలని అన్నారు. ఈ పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.