జిహెచ్ఎంసి, హైడ్రా, వాటర్ వర్క్స్ మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం: పోరెడ్డి బుచ్చిరెడ్డి

శేరిలింగంపల్లి, జూన్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఇటీవ‌ల కురిసిన భారీ వర్షానికి తారానగర్, లోతట్టు ప్రాంతాలు, డివిజన్లోని అన్ని కాలనీలలో చాలావరకు ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం అయ్యాయ‌ని, స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ నాయ‌కుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి ప్ర‌జావాణిలో భాగంగా జోన‌ల్ క‌మిష‌న‌ర్ హేమంత్ బొర్ఖ‌డేకు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ స‌మ‌స్య‌కి ప్రధాన కారణం గతంలో జిహెచ్ఎంసి నిర్వహించిన మెన్షన్ టీం గాని స్టాటిక్ టీమ్ గాని లేకపోవడం వల్లనేనని అన్నారు. కాలనీ ప్రజలు ఈ విష‌యాన్ని త‌న‌ దృష్టికి తేవడంతో అదే విషయాన్ని క‌మిష‌న‌ర్ దృష్టికి తెచ్చామ‌న్నారు. ఇలా ఉండడానికి కారణం జిహెచ్ఎంసి, హైడ్రా, వాటర్ వర్క్స్ ఈ ముగ్గురి కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనేనని పోరెడ్డి బుచ్చిరెడ్డి విమర్శించారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి, సీనియర్ నాయకులు వనం శ్రీనివాస్ గుప్త గారు, చిన్నం సత్యనారాయణ, పాతూరి నారాయణ రెడ్డి, చంద్రమౌళి గౌడ్, భవనం బుషి, జిఎన్ రెడ్డి , రమేష్, వీరుపాలు, రామకృష్ణ, సుబ్బారెడ్డి, సంపత్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here