శేరిలింగంపల్లి, జూన్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బీసీ ఆఫీసులో కొండాపూర్ డివిజన్ బీసీ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బిసి ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసీ కులాల బీసీ సంఘాల ఐకమత్యం కొరకు రాజ్యాధికార సాధనలో భాగంగా గ్రామ గ్రామాన పట్టణాల్లోనూ ప్రతి కాలనీలో బిసి సంఘాలు కమిటీలు ఏర్పాటు చేసే క్రమంలో కమిటీని వేయడం జరిగిందన్నారు. విజయలక్ష్మిని కొండాపూర్ డివిజన్ అధ్యక్షురాలిగా నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి గ్రామీణ ప్రాంతమైన పల్లెటూర్ల వరకు బీసీ కమిటీలు, సంఘాలు ఏర్పాటు చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి కృష్ణ , మియాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్, సాయిలు, మహిళా కోఆర్డినేటర్ లలితారాణి, మహిళా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.