గోపినగర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన చింతకింది గోవర్ధన్ గౌడ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వం వైకరితో తెలంగాణ విమోచన దినం ప్రాముఖ్యత మరింత పెరిగిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ బిజేపి ఉపాధ్యక్షుడు లచ్చమొళ్ల పాండు గౌడ్ ఆద్వర్యంలో గోపినగర్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మఖ్యఅతిథిగా పాల్గొన్న రంగారెడ్డి జిల్లా బిజేపీ నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్ననందకుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని ఉధ్యమించిన కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగానే ఆ విషయాన్ని మరిచిపోయారని, బిజేపి గుర్తు చేస్తున్న వినిపించుకునే పరిస్థితిలో లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే గాని విమోచన దినోత్సవానికి గుర్తింపు రాదన్న సంగతి ప్రజలకు అర్ధం ఐపోయిందని అన్నారు.
మోడి జన్మదినం సందర్భంగా మిటాయిల పంపిణీ…
ప్రధాని నరేంద్రమోడి 70 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పరస్పరం మిటాయిలు పంచుకుని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు నీరటి చంద్రమోహన్, బిజెపి డివిజన్ ప్రధానకార్యదర్శులు చిట్టారెడ్డి ప్రసాద్, ప్రశాంత్, ఉపాధ్యక్షులు బాలు, సీనియర్ నాయకులు మారం వెంకట్, శివకుమార్, యాదగిరి యాదవ్, శంకుతల, జబ్బార్, పట్లోళ్ల నర్సింహా, అరవింద్ గౌడ్ బస్తీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.