శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భెల్ ఎంఐజీ బిజెపి అధ్యక్షుడు కుమార్ అద్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మఖ్యఅతిథిగా పాల్గొన్న రంగారెడ్డి జిల్లా బిజేపీ అధికార ప్రతినిధి తోపుగొండ మహిపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వాలను డిమాండ్ చేశారని,ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి ఆరు సంహాత్సరాలు గడిచి వారే అధికారంలో ఉన్నా ఎందుకు స్పందించడం లేదని అన్నారు. రజాకార్ల వారసు లైన ఎంఐఎం పార్టీ కీ భయపడే విమోచన దినోత్సవ వేడుకలకు ముందుకు రావడం లేదని అన్నారు. 2023 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ దొరల గడీలు కూలడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఠాగూర్ రాజ్ కుమార్ సింగ్, ప్రధాన కార్యదర్శి సుధాకార్, మహిళా నాయకురాలు స్వాతి, అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.