విద్య, ఐక్యతతోనే యాదవుల అభివృద్ధి

  • జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: నెల్లూరు జిల్లా రామాయపట్నం సముద్రతీర ప్రాంతంలో కందుకూరు నియోజకవర్గం యాదవ కార్తీక వన భోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ్ వంశంలో జన్మించటం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. సరైన క్రమశిక్షణ మంచి వ్యక్తిత్వం పెంపొందించుకోవాలని కోరారు. తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ విద్య, ఐక్యతతోనే యాదవుల అభివృద్ధి సాధ్యపడుతుందని, తల్లిదండ్రులు, యాదవ సంఘం పెద్దలు ఈ విషయంలో శ్రద్ధ చూపాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో బీదా రవిచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ , నూకసాని బాలాజీ యాదవ్, మద్దులూరి మాలకొండయ్య యాదవ్, నాగార్జున యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, కాంతారావు యాదవ్ , కార్యక్రమ నిర్వాహకులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. బిల్డర్ హరిబాబు యాదవ్, కృష్ణ యాదవ్, బిజెపి పార్టీ రంగారెడ్డి జిల్లా ఫోక్స్ పర్సన్ అందెల కుమార్ యాదవ్, బోయిన్ పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, మాజీ కార్పొరేటర్ జంగయ్య యాదవ్, బిల్డర్ రమేష్ యాదవ్, నవీన్ యాదవ్, మధు యాదవ్, మరియు పెద్ద ఎత్తున యాదవ కుల బంధువులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

వన భోజన మహోత్సవంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here