నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో డెవలప్మెంట్ అఫ్ కమీషనర్ హ్యాండ్లూమ్, మినిస్ట్రీ అఫ్ టెక్స్ టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా సంయుక్త నిర్వహణలో నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ ఫో నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని మహిళలు అధిక సంఖ్య లో చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఉప్పాడ, మంగళగిరి, కలంకారీ చీరలు, చున్నీలు , డ్రెస్ మెటీరియల్స్, బెడ్ షీట్స్, బ్లౌజ్ లు, తదితర హోమ్ డెకార్స్ మహిళలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చంద్ర శేఖర్, సంధ్య శిష్య బృందం ప్రదర్శించిన అందెల హేళ కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. గణపతి కౌత్వం, పుష్పాంజలి, సరస్వతీ, కృతీ, కృష్ణంకాలయ సఖి, నగుమోము, ముద్దుగారే యశోద, జయ జయ దుర్గే, తిల్లాన, కామాక్షి, బృందావన నిలయే, శంకర, అలరులు తదితర అంశాలను సురభి , శ్వేతా, విద్య, మనోజ్ఞ, అనన్య ప్రదర్శించారు.