నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని యంపీ థియేటర్ లో ఉగాది నాట్య హేళ కూచిపూడి, భరతనాట్యం నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.నారాయణి నాట్యాలయ గురువు సంతోష్ కుమార్ తమంగ్ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శనలో పుష్పాంజలి, అలరింపు, శివస్తుతి, సరస్వతి శబ్దం, శ్రీ రామ చంద్ర, హనుమాన్ చాలీసా, శృంగార లహరి, తిల్లాన అంశాలను మౌనిక, లావణ్య, కృష్ణ ప్రియా, భవ్య, సోమా, అవని, ఉర్విజ , మాన్వి తదితరులు ప్రదర్శించి మెప్పించారు. ప్రొఫెసర్ భాగవతుల సేతు రామ్ శిష్య బృందం వారి కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా పుష్పాంజలి, నమః శివాయతేయ్ తిల్లాన అయిగిరినందిని, రామాయణ శబ్దం, అంశాలను సృజన, శ్రీకృతి, పద్మప్రియ, ప్రణవి, శాంభవి, లాస్య, శీర్య, గానవి తదితరులు ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా రాజేష్, పసుమర్తి శేషు బాబు విచ్చేసి కళాకారులను అభినందించారు.