నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళలు బుధవారం రంగురంగు పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సంబరాలు వారం రోజుల పాటు శిల్పారామంలో జరగనున్నాయి. ఆల్ ఇండియా సారీ మేళ సందర్బంగా చేనేత కళాకారులు ఉదయం 10.30 నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. రాజస్థాన్ కోట సారీస్ , మధ్యప్రదేశ్ చెందేరి , మహేశ్వరం , బీహార్ బాగాల్పోరి , కోల్కతా బెంగాలీ కాటన్ , తస్సార్ , కాంత వర్క్ , తెలంగాణ పోచంపల్లి , గద్వాల్ , గొల్లబామ , తెలియరుమాళ్, ఆంధ్ర ప్రదేశ్ మంగళగిరి, చీరాల , వేంకటగిరి చీరలు , బెంగళూరు సిల్క్ , కాశ్మీరీ సిల్క్ , ఉత్తరప్రదేశ్ బనారసీ చీరలు స్టాల్స్ లో అందుబాటులో ఉన్నాయి. యంపీ థియేటర్ లో యువ నర్తనం డ్యాన్స్ ఫెస్టివల్ సందర్బంగా ఐడీఆర్టీసీ డైరెక్టర్ తాడేపల్లి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యం లో కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. సురేంద్రనాథ్, బిజినా గురువర్యులు గజానన యుత్తం , కొలువైతివా అంశాలపై, డాక్టర్ బిందు మాధవి శిష్య బృందం కామాక్షి స్తుతి , అష్టపది, నృత్యదీక్షిత్లాయ లక్ష్మి శంకర్ శిష్య బృందం గురుమండలం పూజ పార్వతి నందనం , ఆంజనేయం సద – నోటు స్వరం, సకలలోక నాయికీ నవవర్ణ కీర్తన , రాగేశ్వరి తిల్లాన అంశాలను ప్రదర్శించారు.