శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): మసీద్ బండ లోని బీజేపీ కార్యాలయంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవి కుమార్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో హఫీజ్ పేట్ డివిజన్ లో నిర్వహించవలసిన బీజేపీ కార్యక్రమాలు, డివిజన్ లోని ప్రజా సమస్యలపై చర్చించారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని, రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని కార్పొరేటర్ గా గెలిపించుకోవాలని రవి కుమార్ యాదవ్ డివిజన్ నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ వెంకటరమణయ్య, సత్యనారాయణ రాజు, టర్బో శ్రీనివాస్, పాలెం శ్రీనివాస్, పవన్, త్రిపాటి ప్రసాద్ పాత్ర, శివాజీ, రాజు ముదిరాజ్, నవీన్, సురేష్, రామచంద్ర యాదవ్ , ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.