శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని ఎంఐజీ డివిజన్ మహిళా సంఘం కమిటీని శేరిలింగంపల్లి అధ్యక్షుడు, అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, సంఘం మహిళ కమిటీ అధ్యక్షురాలిగా సంగమ్మ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షురాలిగా జి మంగుబాయి, ఉపాధ్యక్షురాలిగా శ్రీలత, ప్రధాన కార్యదర్శిగా సాజిదా బేగం, తపస్సు బేగం, కార్యదర్శిగా శ్రీదేవిని నియమించారు. ఈ సందర్బంగా నూతన నియామకం అయిన వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ మహిళలందరూ చైతన్యవంతంగా ఉండి ఎలాంటి సమస్యలను అయినా ఎదుర్కోవాలని, బీసీల వేదనను ప్రపంచానికి వినిపించాలని అన్నారు. సమస్యలపై పోరాటం కోసం ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఏకతాటిపై నిలిచి బలపడాలని అన్నారు.