శేరిలింగంపల్లి, జూన్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ కాలనీ కి చెందిన బత్తుల నర్సింగరావు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.2,50,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF LOC మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.